అమరావతి : కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎ జగన్ తాజా నిర్ణయం ప్రకారం… రాష్ట్రంలో కోవిడ్ కట్టడి ఆంక్షలు కొనసాగడంతో పాటు…. మరో పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు వరకు ఈ కర్ఫ్యూ అమలు కానుంది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని సీఎం జగన్ ఆదేశించారు.
read also : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక..
కాగా..రాష్ట్రంలో గత 24 గంటల్లో 1628 మంది పాజిటివ్‌గా నమోదు కాగా… మరో 22 మంది కరోనా బాధితులు మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,38,829 కు చేరుకోగా.. రికవరీ కేసులు 19,02,105 కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,154 మంది మృతిచెందగా.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 24,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి.