CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సర్పంచ్‌లకు, గ్రామీణ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వరాలను ప్రకటించారు. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులు…
పీకుడు భాష డైలాగులకే పనికి వస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడవు.. మెడికల్ కాలేజ్ కోటి సంతకాలపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి వ్యాఖ్యలను ప్రజలు గమనించాలి అని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. అసలు రాష్ట్రంలో ఎంత మంది ఓటర్లు ఉన్నారో ఈ మంత్రికి తెలుసా?.. ఏ గ్రామానికైనా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకున్నా IVRS సర్వే చేస్తే ప్రజల అభిప్రాయం ఏంటో మంత్రికి అర్థం అవుతుందన్నారు. చిల్లర మాటలు మాట్లాడి స్థాయి…
రాయ్‌గఢ్‌లో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..! ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో విషాదం చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రిన్సీ కుమారి(20) .. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నివాసి. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్‌లో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్…
బంగ్లా సైన్యాన్ని దెబ్బతీసేందుకు పాక్ ఐఎస్ఐ కుట్ర.. నిఘా నివేదికలో సంచలన విషయాలు.. బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. అక్కడి రాడికల్ ఇస్లామిక్ శక్తులు ఆ దేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నాయి. ఇదే కాకుండా, అంతర్గత వర్గ పోరును కూడా భారత్‌కు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ, రాడికల్ ఇస్లామిస్ట్ విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ హాది హత్య. దీంట్లో భారత ప్రమేయం ఉందని చెబూతూ, అక్కడి మతోన్మాద మూక ఢాకాలోని భారత…
CM Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి జరుపుకునే పండుగగా క్రిస్మస్.. ద్వేషించే వారికి కూడా ప్రేమించే గుణాన్ని ఏసు ప్రభువు మానవాళికి స్ఫూర్తిగా అందించారని పేర్కొన్నారు.
ఆ ఎంపీలు పొలిటికల్‌గా ఎందుకు యాక్టివ్ మోడ్‌లో కనిపించడం లేదు? లేనిపోని విషయాల్లో వేలుపెట్టి నెత్తి మీదికి తెచ్చుకోవడం ఎందుకని అనుకుంటున్నారా? లేక ఇతర కారణాలున్నాయా? టిక్కెట్స్ ఇచ్చి గెలిపించిన పార్టీ నాయకత్వంపై ప్రత్యర్థులు దాడి చేస్తున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారు..? ఎవరు వాళ్ళు? ఏంటా మ్యూట్ మేటర్? లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 8 సీట్లు గెల్చుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్నికల టైంలో, గెలిచిన కొత్తల్లో తప్ప… తర్వాత ఎప్పుడూ గాంధీభవన్ ముఖం చూసిన…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ…
ఇకపై ఏది ఫ్రీ కాదు.. ప్రపంచ వాణిజ్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా కీలక వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాణిజ్య ఆంక్షలు మరింత తీవ్రతరం కావడంతో భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించాడు. అలాగే, రష్యా నుంచి చమురు దిగుమతిని సాకుగా చూపించి భారత వస్తువులపై అమెరికా 50 శాతం వరకు టారిఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. ఈ తాజా పరిస్థితిపై ఇండియా ఎకనామిక్ కాన్క్లేవ్ (IEC) 2025లో…
నేడు చివరి విడత ఎన్నికల పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..! తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరుకు నేటితో తెరపడనుంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నేడు సాయంత్రానికి అభ్యర్థులు…
తెలంగాణ సీఎం రేవంత్ హస్తినలో ఏం చేస్తున్నారు?.. మూడు రోజుల నుంచి ఢిల్లీ టూర్లో ఉన్న ముచ్చట్లేంటి?.. అంతా పైకి కనిపిస్తున్నది, వినిపిస్తున్నదేనా? లేక అంతకు మించి ఇంకేదో జరుగుతోందా?.. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళడం కొత్తకాదు, పార్టీ పెద్దలు, కేంద్ర మంత్రుల్ని కలవడమూ కొత్త కాదు.. మరి ఇప్పుడే ఎందుకు ప్రత్యేకంగా చూస్తున్నారు? మాట్లాడుకుంటున్నారు? లెట్స్ వాచ్. ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ హైదరాబాద్ టూర్ ముగిసిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్ళిపోయారు. మ్యాచ్…