రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తనను కలిసిన బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం మాట ఇచ్చారు. తమకు ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన సహకారం అందించాలని కోరారు. గతంతో పోలిస్తే న్యాయవాదుల సంఖ్య పెరిగిందని, అందుకు తగినట్లుగా న్యాయవాదుల సంక్షేమ సంఘానికి తగినంత ఆర్థిక సాయం…
వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి,…
బీజేపీ నేతలపై మాజీమంత్రి జోగురామన్న సంచలన ఆరోపణలు.. ఏమన్నారంటే..? రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీ నేతలు వ్యాపారులను బెదిరించి రూ. కోట్లు వసూలు చేస్తున్నారని.. ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్, మరో నేత అశోక్ లు కలిసి చందాల దందా చేస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న సంచలన ఆరోపణలు చేశారు. అదిలాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. ” వీరికి గతంలో దొంగ నోట్ల…
ఇప్పటి వరకు మూడు దశలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 200 సీట్లలో విజయం సాధించనున్నామని ధీమా వ్యక్తం చేశారు అమిత్షా. ఇవాళ ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం పైన పైసా కూడా అవినీతి చేయలేదని, అలసి పోగానే బ్యాంకాక్, థాయిలాండ్ ఎవరు వెళ్తారో మీకు అందరికీ తెలుసు అని ఆయన…
CM Revanth Reddy: తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో సందేశం ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించాలని కోరారు.
ఈ లోక్ సభ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ షాద్ నగర్ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ వాసి బూర్గుల రామకృష్ణారావు నాయకత్వం వహించారన్నారు. మళ్లీ 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా కు కీలకమైన మంత్రి పదవులు…
రాయణపేట జిల్లా పై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ పెట్టాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శుక్రవారం ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొనబోతోంది. గంట తేడాతో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు హాజరుకానున్నారు.
పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలే.. పథకాలన్నింటిని కొనసాగించాలంటే నిర్ణయించేది ఈ ఎన్నికలేనని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇంటింటి అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మీ జగనే రావాలన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు అని.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనన్నారు. చంద్రబాబు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ, అమిత్…
కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో…