CM Revanth Reddy: కాంగ్రెస్ లోకి రండి.. పోచారంను ఆహ్వానించిన సీఎం రేవంత్
- మాజీ స్పీకర్ పోచారం తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ బీఆరెస్ ఎమ్మెల్యే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. దీంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం పోచారం ఇంటికి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ వెళ్లారు. వీరిద్దరు పోచారంతో భేటీ అయ్యారు. అనంతరం పోచారం నివాసానికి కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఈ క్రమంలో తాజా రాజకీయాలపై చర్చ జరిగింది. అలాగే పోచారంను సీఎం రేవంత్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కండువా కప్పి పార్టీలోకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
Read also: Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్‌పై స్టే విధించిన కోర్టు..
Also Read
ఈ నేపథ్యంలోనే నేడో, రేపో పోచారం కాంగ్రెస్ లో చేరతారనే చర్చ సాగుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రివర్గ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.అయితే సీఎం రేవంత్ రెడ్డి మాజీ స్పీకర్ నివాసానికి వెళ్లారనే విషయం తెలియగానే పోచారం నివాసానికి బాల్క సుమన్, బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. పోచారం నివాసం వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ కాసేపు బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
Gold Rate Today: మగువలకు భారీ షాక్.. తులం బంగారంపై రూ.810 పెరిగింది!
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?