తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు.
Bandi Sanjay: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ రాశారు. కాళేశ్వరం మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.
నేడు లోక్ సభ ఎన్నికల తుదిదశ ఎన్నికల పోలింగ్. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్. 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాలకు పోలింగ్. నేడు గవర్నర్‌ను కలువనున్న సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్‌ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్న రేవంత్. నేడు పోస్టల్ బ్యాలెట్‌పై ఏపీ హైకోర్టులో విచారణ. సాయంత్రం 6 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టు తీర్పు. బెంగళూరులో నేడు సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ. నేటి నుంచి…
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాష్ట్ర అవతరణ దినోత్సవ ఆహ్వానం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర వేణుగోపాల్ రావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.
K. Laxman: రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉంటే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిందితులను శిక్షించాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy: సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ స్కూల్లో రిటైర్డ్ ఆర్చ్ బిషప్ తుమ్మబాల భౌతికకాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.