నేను ఓడిపోతానా..? ఎగ్జిట్ పోల్స్ పై రోజా ఫస్ట్ రియాక్షన్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ అంచనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై స్పందించారు మంత్రి రోజా. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు వండుతున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని చెప్పినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కావడం తథ్యమని రోజా స్పష్టం చేశారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు…
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న…
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స సంబరాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు.
BRS: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి 108 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నేడు పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఉదయం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ప్రజలు సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఉదయం 9:30 గంటలకు…
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు.