Harish Rao: పల్లె ప్రగతి మీద ప్రతీ నెలా 3,300 కోట్లు బీఆర్ఎస్ ఖర్చు చేసిందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో పరిశుద్ధం నిలిచి పోయి మలేరియా డెంగ్యూతో ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేశారన్నారు. మా ప్రభుత్వంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో భాగంగా ఎడదికి రెండు సార్లు డ్రైవులు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా గ్రామాలను పట్టణాలను పట్టించుకోవడం లేదన్నారు. ఏ ఒక్క గ్రామ పంచాయితీకి పట్టణానికి నిధులు విడుదల చేయడం లేదన్నారు. మా హయంలో ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డులు అందుకున్నామని తెలిపారు. మేము రాకముందు గ్రామాల్లో 85 ట్రాక్టర్లు ఉండేవని, మేము అధికారం చేపట్టాకా ప్రతీ గ్రామానికి ఒక్కో ట్రాక్టర్ ఇచ్చామని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పుడు పల్లెలు కన్నీరు పెడుతున్నాయని, పల్లెల్లో డీజిల్ కి డబ్బులు లేక ట్రాక్టర్లు మూలకు పడ్డాయన్నారు. పెట్రోల్ బంకుల్లో అప్పు కూడా ఇవ్వడం లేదన్నారు.
Read also: Akhilesh Yadav : ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతది.. లోక్ సభలో అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
నా నియోజకవర్గంలో రోడ్డు టాక్స్ కట్టలేదని గ్రామపంచాయితీ ట్రాక్టర్ ను ఆర్టీవో సీజ్ చేశారన్నారు. మేడిపల్లి గ్రామంలో 5 నెలలుగా పరిశుద్ధ కార్మికులకు జీతాలు అందలేదని వెల్లడించారు. దానితో వారు పరిశుద్ధ పని చేయడం నిలిపివేశారని తెలిపారు. ఇక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిందని అన్నారు. పల్లెల పరిస్థితి పై ఎందుకు రివ్యూ చేయడం లేదన్నారు. సర్పంచులకు బిల్లులు విడుదల చేయక గవర్నర్ వద్ద కి వచ్చి మొర పెట్టుకునే పరిస్థితి నెలకొందని, పల్లెలు ప్రజాస్వామ్యంలో రావా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పల్లె ప్రగతి మీద ప్రతీ నెలా 3,300 కోట్లు బీ.ఆర్.ఎస్ ఖర్చు చేసిందని.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఉడిపోయినట్లు అయ్యింది కాంగ్రెస్ నీ గెలిపించిన ప్రజలదని తెలిపారు. గత ప్రభుత్వం 20 వేల కోట్లు ఖర్చు పెడితే.. ఏడు నెలల్లో ఏడు పైసలు కూడా ఎందుకు విడుదల చేయడం లేదన్నారు. ఇందిరమ్మ పాలన అన్నారు.. కానీ లోకల్ బాడిలను నిర్వీర్యం చేస్తున్నారన్నారు.
Read also: Akhil: అయ్యగారు ఎక్కడా తగ్గట్లేదు.. ఈసారి లెక్కేసి కొట్టడమే!
అభివృద్ధి చేసే విధంగా బీ.ఆర్.ఎస్ పని చేస్తే దాన్ని నిర్వీర్యం చేసే పనిలో కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. తక్షణమే పెండిగ్ లో ఉన్న సర్పంచుల బిల్లులు విడుదల చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆంక్షలు తప్పా పిన్షన్లు లేవన్నారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబు పాత బాకీ తో కలిపి 7 వేలు ఇస్తున్నాడన్నారు. మన రాష్ట్రంలో నాలుగు వేల పెన్షన్ అని చెప్పి ఉన్న పెన్షన్ కూడా ఇవ్వడం లేదన్నారు. వెంటనే రెండు నెలలుగా పెండింగ్ లో ఉన్న పెన్షన్ డబ్బులను విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ కి ఓటు వేసినందుకు ఖమ్మం జిల్లాలో చింతకాని మండలంలో ఓ వ్యక్తి వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ప్రభాకర్ ఆత్మహత్య హృదయ విదారకంగా ఉందని, ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదన్నారు.
Read also: Akhilesh Yadav : ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతది.. లోక్ సభలో అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ప్రభాకర్ చనిపోయాక ఆయన తండ్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేసినా కూడా పోలీసులు నిరాకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా మారాయి అనేది అర్థం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ విషయంలో ఎస్సై , ఎమ్మార్వో స్పందించి ఉంటే ప్రభాకర్ చనిపోయేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది ఉంటే మమ్మల్ని కలవండి.. మీ తరుపున మేము పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు అని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఆ రైతు చనిపోతూ ముఖ్యమంత్రి కి చేరాలని చివరి కోరిక కోరాడని తెలిపారు. కానీ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి తో పాటు ఎవరూ కూడా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read also: The RajaSaab: ప్రభాస్ రాజాసాబ్ కథ లీక్.. నిర్మాత కాపీ ఆరోపణలు!
ఆ రైతు కుటుంబానికి 25 లక్షల ఎగస్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొలి నాల్లలోనే 7 మండలాలను ఏపీలో కలిపారని, దానితో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ ఆ రాష్ట్రానికి వెళ్ళిందన్నారు. దానిని కేసీఆర్ తీవ్రంగా ఖండించి బందుకు కూడా పిలుపునిచ్చారు. ఆ బిల్లు పెట్టింది బీజేపీ ఐతే ఆమోదించింది కాంగ్రెస్ అంటూ ఆరోపించారు. భద్రాచలంలో కనీసం భక్తుల పార్కింగ్, డంపింగ్ కు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన సహచరుడు చంద్రబాబుతో సంప్రదించి ఆ ఏడు మండలాలు వెనిక్కి తేవాలని కోరుతున్నామన్నారు. ఈ ఏడు మండలాలు ఇచ్చిన తరువాతనే మిగతా విభజన అంశంపై చర్చించాలని హరీష్ రావు కోరారు.
Suhas – Janaka Aithe Ganaka: మరో డిఫరెంట్ టైటిల్ తో రాబోతున్న సుహాస్.. టీజర్ కూడా..