CM Revanth Reddy: తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ ను లైవ్ చేయడంలో ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
మెగా లోక్ అదాలత్‌ను రాష్ట్ర ప్రజలు వినియోగించుకోవాలి.. ఈరోజు జరిగిన ప్రత్యేక టెలికాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల ఎస్పీ, సీపీలతో మెగా లోక్ అదాలత్ లో రాజీ పడదగిన కేసులను డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఐపీఎస్ సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు జరగనున్న లోక్ అదాలత్‌లో అన్ని పోలీస్ స్టేషన్లలో పెండిగ్లో ఉన్న రాజీ పడదగిన కేసులను త్వరిత గతిన పూర్తి చేసి, తగు ఫలితాలు రాబట్టాలని ఆదేశాలు జారీ చేసారు. ఈ సందర్భంగా డీజీపీ ద్వారకా…
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమాలకు హాజరుకావాలంటూ.. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్, కిషన్ రెడ్డి, సంజయ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమాలకు హాజరుకావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,…
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, దీనికి కారణం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసేదంతా చేసి శాంతిభద్రతలపై రివ్యూ నిర్వహిస్తున్నారు అంటున్నారని, నిన్న ఏమైంది లా అండ్ ఆర్డర్ ? నిన్న ఆపి ఉంటే శాంతి భద్రతల సమస్యలు వచ్చేవి కావుకదా ! అని ఆయన అన్నారు. నిన్న యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా డీజీపీ గారు.. ఎవరిమీద దాడి…
Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి థ్యాంక్స్ చెప్పారు. గాంధీ కి ఎస్కార్ట్ ఇచ్చి పోలీసులు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను గాంధీ గుండాలతో చంపించే ప్రయత్నం చేశారు పోలీసులు అని ఆరోపించారు.
ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. సీతారాం ఏచూరి చేసిన పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకమని అన్నారు.
Rachakonda: పిల్లలు ప్రయోజకులుగా మారినప్పుడు తండ్రి హృదయం ఆనందంతో ఉప్పొంగుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన కూతురు తనకంటే పెద్ద హోదా అందుకోవడంతో తన మొదటి సెల్యూట్ చేస్తూ ఓ తండ్రి ఉద్వేగానికి లోనైన అరుదైన ఘటనకు SSI ట్రైనీ క్యాడెట్ల మూడో దీక్షాత్ పరేడ్ వేదికైంది.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. రేవంత్ 9 నెలల పాలనలో 2 నెలల పెన్షన్ మింగేశారని హరీష్ రావు విమర్శించారు.…
వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టాన్ని మాజీ మంత్రి వడ్డే శోభనదీశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్, జిల్లా కలెక్టర్ బాలాజీ, ఆర్డీవో రాజు పాల్గొన్నారు. బోడె ప్రసాద్ మాట్లాడుతూ.. వరద…
సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.