వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏపీ సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. కేబినెట్ నిర్ణయాల అమలు, పెండింగ్ అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సీఎం ఇచ్చిన హామీలపై తీసుకున్న చర్యలపై శాఖల వారీగా నివేదిక ఇవ్వాలని సమావేశంలో కార్యదర్శులకు ఆదేశాలిచ్చారు. నవంబరు 30 తేదీనాటికల్లా కరోనా కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల చేపట్టాల్సిందిగా మెమో జారీ చేశారు. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి డీపీసీల నియామకంపై చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ సూచనలు…