సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని కేటాయించాలని లేఖలో పేర్కాన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తానన్న ప్రస్తుత భూమి, ఆస్పత్రి నిర్మాణానికి అనువుగా లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్తానన్న భూమిపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను లేఖతోపాటు సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి పంపించారు. అయితే.. రామగుండంలో వంద పడకల ESI ఆస్పత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని, అయితే..…
KTR: వ్యక్తులకు ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఓ రేంజ్‌లో ఉన్నోళ్లు కూడా దీన్ని ప్రదర్శిస్తుంటారు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నేతలు వైఎస్సార్సీపీ పేరును పూర్తిగా ప్రస్తావించరు. వైకాపా అని గానీ వైసీపీ అని గానీ క్లుప్తంగా అంటుంటారు. కేటీఆర్ బండి సంజయ్ కుమార్ పేరును షార్ట్ కట్‌లో "బీఎస్ కుమార్" అని వెరైటీగా రాశారు.
కాళేశ్వరం పంప్ హౌజ్‌ల ముంపుకు కేసీఆర్ బాధ్యత వహించాలని భాజపా నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. కాళేశ్వరం వచ్చి కన్నీళ్లు తెచ్చింది అని రైతులు ఏడుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల శాఖకు మంత్రి లేకపోవడం, సీజన్‌లో అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఈటల విమర్శించారు.
కేసీఆరే ఇంజినీర్, డాక్టర్, మేధావి అని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాస్కీ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తారని.. కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందని ఆయన ఆరోపించారు.