విపక్షాలపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకమై రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఓటీఎస్ వరంలాంటిదని ఆయన అభివర్ణించారు. ఏకకాలంలో ఇంటిపై పూర్తి హక్కును పొందేలా జగన్ తీసుకువచ్చిన ఓటీఎస్‌పై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరవు భత్యాన్ని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన కరువు భత్యాన్ని 2022 జనవరి నెల జీతంతో కలిపి విడుదల చేసేందుకు గానూ ప్రభుత్వం ఆమోదం తెలియచేసింది. జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన కరవు భత్యం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్ డే కి సర్వం సిద్ధం అవుతోంది. జగన్ 49వ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యేలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలకు సన్నాహాలు చేస్తున్నాయి పార్టీ శ్రేణులు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దగ్గర పచ్చని గడ్డి మొక్కలతో సీఎం జగన్ చిత్రం రూపకల్పన చేశారు. సీఎం జగన్ పై ప్రత్యేకంగా పాటలు సిద్ధం చేయించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. పాటల వీడియో…
ఏపీ హైకోర్టుపై ఇటీవల విమర్శలు చేసిన మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను చంద్రబాబు పక్షమో, జగన్ పక్షమో కాదని స్పష్టం చేశారు. రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు.. వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు విని, సమన్యాయం అందించేందుకు ప్రయత్నించాలని మాత్రమే తాను చెప్పానని జస్టిస్ చంద్రు పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు విషయం తన వ్యాఖ్యలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.…
ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్.జగన్ మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్‌పీ ధర లభించాలని… రైతులందరికీ ఎంఎస్‌పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలని…
రేపు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి శ్రీకారం చుట్టనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు సీఎం జగన్. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించి అనంతరం…
వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీసీ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని.. మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ…. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. అక్కడక్కడే పరిష్కరించే సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయని.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన…
సి.ఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు కోడిపందాల పర్మిషన్ కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముద్రగడ లేఖ ద్వారా సీఎం జగన్ ను కోరారు. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని… గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు ఆచారమని గుర్తు చేశారు. ఇటీవల సంక్రాంతికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. చివరికి…
ఏపీలో ఆన్ లైన్ టికెట్ల వ్యవస్థకు సర్వం సిద్ధం అవుతోంది. ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థకు నోడల్ ఏజెన్సీగా APSFTVDC నియామించింది. ప్రభుత్వ ఉత్తర్వులతో ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది APSFTVDC. ఆన్ లైన్ టిక్కెటింగ్ పోర్టల్ ఎలా వుండాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. పోర్టల్ రూపకల్పనపై ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెటింగ్ సంస్ధలతో ఒకటికి రెండు సార్లు భేటీ నిర్వహించారు మంత్రి పేర్ని వెంకట్రామయ్య, అధికారులు. వివిధ సినీ థియేటర్లతో ప్రైవేట్…
హిందూ దేవాలయాల షాపింగ్ కాంప్లెక్సులను ఇతర మతస్థులకు కూడా కేటాయించవచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరం అన్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. బీజేపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా వున్న ఆయన ఈ అంశంపై తన అభిప్రాయం వెలిబుచ్చారు. పిటిషనర్ గానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ సమస్యను సుప్రీంకోర్టు ముందు సరైన రీతిలో ఉంచినట్టు లేరు. ఇక్కడ అంశం అమ్మకానికి సంబంధించింది కాదు. హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టిన షాపింగ్ కాంప్లెక్సులను…