వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో విజయవాడ NIA కోర్టులో ఇవాళ ( సోమవారం ) విచారణ జరిగింది. సీఎం జగన్ తరపున లాయర్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్ఐఏ పలు అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. అలాగే కుట్ర కోణంపైనా దర్యాప్తు చేయలేదని.. కాబట్టి తదుపరి దర్యాప్తు అవసరం ఉందని వాదించారు.