తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోరోజు పర్యటించారు. వకులామాత అన్నప్రసాద వంటశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వంటశాలను పరిశీలించి భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. అంతకు ముందు టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, వివిధ విభాగాల అధికారులు హాజరయ్యారు.