Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.