Home
Cjp
Cjp News
-
CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఢిల్లీ నిరసనల తర్వాత వరస కేసుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు ఇప్పడు మళ్లీ కొత్త కార్యక్రమానికి తెర తీశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’(ప్రజలు ఏమంటున్నారు) అనే కార్యక్రమం ద్వారా జాతీయ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నవంబర్ 22న గోవా నుంచి ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను వినడం, స్థానికంగా పరిష్కారం కావాల్సిన అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేమని… -
Abhijeet Dipke: ‘మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను’.. దీపావళి సందర్భంగా అభిజీత్ దీప్కే భావోద్వేగ పోస్ట్..
దీపావళి పండుగ సంతోషాలను, వెలుగులను , ఆత్మీయుల సాన్నిహిత్యాన్ని మోసుకొస్తుంది. అయితే చాలామంది ఉద్యోగాలు, చదువుల వల్ల ఇళ్లకు దూరంగా ఉంటూ ఈ పండుగను జరుపుకుంటారు. అలాంటి వారి కోసం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. అమెరికాలో కుటుంబానికి దూరంగా తాను జరుపుకున్న రెండు దీపావళి పండుగల జ్ఞాపకాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.… -
Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
Rahul Gandhi: ఓటర్ సవరణ జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిలిపివేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఆదివారం నవంబర్ 1న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. రాంలీలా మైదాన్‌లో ప్రతిపక్షాల ర్యాలీ జరగబోతోంది. ఇదిలా ఉంటే, ఈ ర్యాలీ కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఢిల్లీ వ్యాపారస్తులు ఇప్పటికే రాహుల్ గాంధీకి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్… -
CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే శనివారం ఢిల్లీలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. తమ నిరసనలకు మద్దతు తెలిపినందుకు మమతకు దీప్కే కృతజ్ఞతలు చెప్పారు. ఎన్నికల సంఘంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఆదివారం నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీకి CJP మద్దతు తెలుపుతున్నట్లు దీప్కే ప్రకటించారు. అయితే, ఈ ర్యాలీలో… -
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
Madras High Court: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి, జర్నలిస్టు సౌరవ్ దాస్ వ్యవహారంపై మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆయన నేపథ్యంపై సమగ్ర విచారణ జరిపించాలని, న్యాయవ్యవస్థతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారనే ఆరోపణలతో ఆయన సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. ఆయన తల్లిదండ్రలతో సహా వ్యక్తిగత నేపథ్యంపై విచారణ జరిపించాలని పిటిషన్లో కోరారు. దీనిపై అక్టోబర్ 30, శుక్రవారం ప్రధాన… -
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
CJP: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ 10 లక్షల మందితో ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు ప్రకటించింది. ఈ మేరక సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.… -
Abhijeet Dipke: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుల తొలగింపు.. కేంద్రంపై అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు
Abhijeet Dipke: ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టుల్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేందుకు చర్యలు తీసుకుంటోందని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఇన్స్టాగ్రామ్ తమ పోస్టుల్ని తొలగిస్తోందని అన్నారు. ప్రతీ రోజూ వేలాది పోస్టులను తొలగించేలా ఇన్‌స్టాపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు. బుధవారం ఎక్స్‌లో స్పందిస్తూ.. ఈ చర్యల వల్ల ప్రజల ప్రశ్నలు కనుమరుగు కావని అన్నారు. “ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు విధించడం వల్ల ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం ప్రతిరోజూ వేలాది పోస్టులు, ఖాతాలను తొలగిస్తోంది.… -
Saurav Das: ‘‘ఢిల్లీలో ఉంటున్నట్లు ఆధారాలేవి?’’ CJP నేతకు కోర్టు ఆదేశం
Saurav Das: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్‌కు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్(SEM) కోర్టులో చుక్కెదురైంది. ‘‘శాంతి ఒప్పందం’’ దాఖలు ప్రక్రియ సందర్బంగా ఢిల్లీలో సౌరవ్ దాస్ నివాసానికి సంబంధించిన రుజువుల్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు కొన్ని రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అక్టోబర్ 10న వీరిద్దరు సంతకం చేసిన పీస్ బాండ్‌ను ఉల్లంఘించి, ఆంక్షలు ఉన్నప్పటికీ జంతర్ మంతర్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు.… -
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
Annamalai: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనలపై కేంద్ర ప్రభుత్వ చర్యలను విమర్శించిన మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు. CJPకి తాను మద్దతు ఇచ్చినట్లు భావించొద్దని అన్నారు. ‘‘ మేం ఎప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. మా ఎజెండా వేరు’’ అని అన్నామలై స్పష్టం చేశారు. గురువారం ‘‘వీ ద లీడర్స్’ ఉద్యమం నిర్వహించిన కార్యక్రమంలో అన్నామలై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీజేపీ… -
CJP: సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలకు క్రైమ్ బ్రాంచ్ బిగ్ షాక్..!
CJP:కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు షాక్ ఇచ్చారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన నమోదైన రెండు కేసుల్లో వారి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సమన్లు జారీ చేసింది. సీజేపీ సభ్యుడు అజింక్యా షిండేకు కూడా సమన్లు జారీ చేుసినట్ల ఢిల్లీ పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దాస్, రాంకాలు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో విచారణకు హాజరు…
తాజావార్తలు
-
Tamil Nadu: మహిళా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే వేధింపులు.. పోలీసుల మౌనంపై హైకోర్టు ఆగ్రహం!
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
TGSRTC: టెక్నాలజీ వాడకంలో టీజీఎస్ఆర్టీసీ నయా రికార్డ్.. బస్సులో “i-ALERT” కన్ను..
-
Meenakshi Chaudhary : “చివరికి ఇదంతా బిజినెస్సే!”.. ఇండస్ట్రీలో వివక్షపై మీనాక్షి చౌదరి సంచలన వ్యాఖ్యలు!
-
Putin Praises India: భారత్‌లో ఇన్ని భాషలా? ఈ వైవిధ్యం అద్భుతం.. పుతిన్ ప్రశంసలు!
ట్రెండింగ్
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!