విజయసాయిరెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారు. తన పైన ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విషయంలో 10 ఏళ్లకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారు. బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ.. న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధిస్తున్నారు. విజయసాయి రెడ్డి వ్యవహరంపై విచారణ చేయాలి.. విజయసాయి రెడ్డే కాదు.. వైఎస్ జగన్ కూడా పదేళ్ల నుంచి బెయిల్ మీదే ఉన్నారు అంటూ ఆమె సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధేశ్వరి
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగి రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సీజేఐ.. బెయిల్ ను రద్దుచేసి మళ్లీ ఫలానా రోజున విడుదల చేయాలంటూ ఇచ్చిన…