హైదరాబాద్‌లోని తన నివాసంలో సివిల్స్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అల్పాహార విందు ఇచ్చారు. సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్, మెంటార్ మల్లవరపు బాలలత నేతృత్వంలో సివిల్స్ ర్యాంకర్లు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారిని మంత్రి హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. సివిల్స్‌లో ర్యాంకులు సాధించి తెలుగువారందరికీ గర్వకారణంగా నిలిచారని మంత్రి అభినందించారు. స్వయంగా ఐఏఎస్ అయిన బాలలత.. హైదరాబాద్‌లో ఐఏఎస్ శిక్షణ సంస్థ సీఎస్‌బీ అకాడమీని ఏర్పాటుచేసి ఇప్పటివరకు వందమందికిపైగా…