CM MK Stalin: సివిల్ సర్వీస్ అభ్యర్థుల విన్నపాలను పరిగణనలోకి తీసుకొని, వాళ్లకు మరో అవకాశమివ్వాలని ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారని, చివరి అవకాశాన్నీ కోల్పోయిన వారున్నారని అన్నారు. అలాంటి వాళ్ల అభ్యర్థనను స్వీకరించి వయోపరిమితిని పెంచుతూ మరో సారి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరారు. చివరి అవకాశం కోల్పోయిన అభ్యర్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలంటూ..పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ…