గ్రేటర్ రహదారులపై రెండు, మూడు, నాలుగు చక్రాల వాహనాల వేగ పరిమితిని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన రహదారులపై కారు 60.. బస్సులు, ఆటోలు, బైక్‌లు 50 వేగంతో ప్రయాణించాలని నిర్దేశించింది. ఈ మేరకు బుధవారం అధికారికంగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాలనీ రహదారులపై 30 కి.మీ.వేగంతో వెళ్లాలని సూచించింది. గతంతో పోల్చితే గ్రేటర్ వ్యాప్తంగా ప్రధానరోడ్లతోపాటు అంతర్గత రహదారులు మెరుగుపడ్డాయి. అవసరమున్నచోట్ల బీటీ, వీడీసీసీ, సీసీ రోడ్ల ను నిర్మించడంతో జీహెచ్ ఎంసీ, పోలీసు, రవాణా శాఖ…