Citizenship Rules: పొరుగు దేశాల నుంచి మతపరమైన వివక్ష ఎదుర్కొని, అక్కడ మైనారిటీలుగా ఉండీ, భారత్‌లో స్థిరపడిన వారికి పౌరసత్వం ఇచ్చే ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)’ వచ్చే నెలలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏ అమలు 2019లో దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. అయితే, ఇటీవల బీజేపీ నేతలు త్వరలోనే సీఏఏ అమలు అవుతుందనే వ్యాఖ్యలు చేశారు.