అనారోగ్యంతో బాధపడుతూ కొన్నాళ్లలో చనిపోతారని భావిస్తున్న కొందరి చేత బలవంతంగా బీమా చేయించి, ఆపై వారిని హత్యచేసి బీమా సొమ్ము కొట్టేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేదో సినిమా కధలా అనిపిస్తుంది కదూ.. కానీ అలా అనిపించినా అదే నిజం. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురు మనుషులను మట్టుబెట్టిన విషయం కూడా తెలిసి పోలీసులు షాకయ్యారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం నల్గొండ జిల్లాలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యంతో…