'ఆర్ఆర్ఆర్'చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో పెరిగిపోయింది. ఆ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం బాలకృష్ణ తదుపరి చిత్రం భగవంత్ కేసరి. గార్జియస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సారథ్యం వహిస్తున్నారు.
Ranbir Kapoor:ఇప్పటికే సంజయ్ దత్ బయోపిక్ గా రూపొందిన 'సంజూ'లో నటించి, భలేగా సందడి చేసిన రణబీర్ కపూర్ మరో బయోపిక్ చేయనున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ప్రఖ్యాత గాయకుడు కిశోర్ కుమార్ జీవితం నేపథ్యంలో రూపొందబోయే చిత్రంలో తాను నటిస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ పేర్కొన్నాడు.
Spielberg - Tom Cruise: చిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ శాశ్వత శత్రువులు కానీ, శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూయిజ్, ఆస్కార్ అవార్డు విజేత స్టీవెన్ స్పీల్ బెర్గ్ అదే విషయాన్ని మరోమారు నిరూపించారు. స్పీల్ బెర్గ్ దర్శకత్వంలో టామ్ క్రూయిజ్ తొలిసారి నటించిన చిత్రం 'మైనారిటీ రిపోర్ట్', మంచి విజయం సాధించింది.