గోదారి గట్టుంది, గట్టు మీద సినిమా చెట్టు ఉంది.. అయితే ఆ చెట్టు కూలిపోయింది. ఇంతవరకు మీకు తెలుసు.. కానీ ఇప్పుడు ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తోంది. అవును ఆశ్చర్యం అనిపించినా అది నిజమే అండోయ్. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ వృక్షం ఇప్పటి వరకు సుమారు 300లకు పైగా సినిమాల్లో కనిపించిన ఈ నిద్ర గన్నేరు మహా వృక్షానికి పునర్ జన్మ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండు వైపులా ఉన్న…