టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అంశం హాట్ టాపిక్ అవుతుంది. అదే చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు ఎందుకు రారు అనేది. అసలు విషయం ఏమిటంటే బాహుబలి సినిమాలో కీలకపాత్రలో నటించిన రాకేష్ తర్వాత ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఏకంగా నిర్మాతగా పేక మేడలు అనే సినిమా చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జితేందర్ రెడ్డి అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం రోశయ్య మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటున్నారు.. సీఎంలు, మాజీ సీఎంలు, మంత్రులు, నేతలు, సినీ ప్రముఖులు ఇలా అంతా రోశయ్యకు సంతాపాన్ని ప్రకటిస్తూ.. కుటుంబసభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు…
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, ఉగాది పండుగలను ఎంత బాగా జరుపుకుంటామో కేరళలో అంతే సందడిగా ఓనం పండగను జరుపుకుంటారు. కేరళలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఓనం పండగ ఒకటి.. ఈ పండగను మళయాళీలందరూ భక్తి శ్రద్దలతో, కుటుంబసభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకుంటారు.ఈ పండగను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పది రోజులు అనేక సాంస్కృతిక, జానపద కార్యక్రమాలతో పాటు వివిధ సాహస కార్యక్రమాలు చేపడతారు. ఒక్కోరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించే తీరు…
సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, ఫిల్మ్ రైటర్, కథా రచయిత తోట ప్రసాద్ పలు దిన, సినిమా వార పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేశారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తోట ప్రసాద్ తన భార్య గీత, రెండవ కుమార్తె మనోజ్ఞ సహకారంతో కరోనా బాధితులకు దాదాపు రెండు నెలల పాటు ఉచితంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. ఆయనలోని మానవీయ కోణాన్ని గుర్తించి సినీ ప్రముఖులు అభినందించారు. ఆగస్ట్ 14న తోట ప్రసాద్ కుమార్తె మనోజ్ఞ వివాహం సాయికృష్ణతో…
టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత తరఫున పాల్గొని తొలి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు నీరజ్ చోప్రా. జావెలిన్ త్రోలో భారత్ కు దక్కిన తొలి స్వర్ణమిది. అంతేకాదు అధ్లెట్స్ విభాగంలోనూ భారత్ ఒలింపిక్స్ లో అందుకున్న మొట్టమొదటి బంగారు పతకం ఇది. ఈ సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నీరజ్ చోప్రాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దక్షిణాదిలో చిరంజీవి, మోహన్ బాబు, మహేశ్ బాబు, మోహన్ లాల్, ఎస్.…
‘జూలీ’ సినిమాలో నేహా ధూపియా నగ్నంగా దర్శనం ఇచ్చింది. అంతే కాదు, ఆమె అప్పట్లో బాలీవుడ్ గురించి మాట్లాడుతో ‘ఇక్కడ సెక్స్ అండ్ షారుఖ్ ఖాన్… రెండు పదాలు మాత్రమే అమ్ముడవుతాయి. మా సినిమాలో షారుఖ్ లేడు. కాబట్టి, సెక్స్ ను వాడుకున్నాం’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది! అన్నంత పనీ చేసి చూపుతూ న్యూడ్ గా థ్రిల్ చేసింది! ‘మాయ మేమ్ సాబ్’ సినిమాలో దీపా సాహీ అనే అందగత్తె కూడా పూర్తిగా వస్త్రాలు…
దీపికా పదుకొణే నుంచీ ప్రభాస్ దాకా మన స్టార్స్ ఏం తింటారు? ఈ సంగతి తెలుసుకుంటే భలేగా ఉంటుంది కదా! మరింక ఆలస్యమెందుకు…ముంబైలో సూపర్ స్టార్ గా ఎదిగినప్పటికీ దీపిక పదుకొణే డైనింగ్ టేబుల్ వద్ద మాత్రం దక్షిణాది అమ్మాయే! ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, ఊతప్పమ్, ఉప్మా లాంటివే ఉంటాయట!కండల వీరుడు సల్మాన్ మంచి ఆహార ప్రియుడు. ఏది తిన్నా గట్టిగానే తింటాడు. అందుకు తగ్గట్టుగా జిమ్ లో శరీరాన్ని అరగదీసే భాయ్…
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ పార్టీ జయకేతనం ఎగరేసింది. పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కడంతో ఆయన పార్టీలోనూ తన పట్టు బిగించే పనిలో పడ్డారు. ఇంతవరకూ కేరళ వైద్య ఆరోగ్య శాఖామంత్రిగా కె.కె. శైలజ ఉన్నారు. శైలజా టీచర్ అంటూ ఆమెను ప్రతి ఒక్కరూ సొంతమనిషిలా పిలుస్తుంటారు. తాజాఎన్నికల్లో మత్తనూర్ నియోజక వర్గం నుండి 60 వేలకు పైగా మెజారిటీ తో శైలజా టీచర్ గెలిచారు. ఎంతో ప్రజాదరణ ఉన్న ఆమెకు ఈసారి…