తెలుగు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు తమ వేతనాలు, పారితోషికాలు 30% పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా టాలీవుడ్‌లోని అన్ని షూటింగ్స్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పరిశ్రమ మొత్తం స్తంభించి పోయింది. ఇతర భాషా ఫిల్మ్ ఇండస్ట్రీలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు సినీ కార్మికుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా స్పందించగా, గత మూడు ఏళ్లుగా వేతనాల్లో పెంపు లేనందున ఈ డిమాండ్ సమంజసమేనని…