Today Business Headlines 14-03-23: సీఎండీగా అదనపు బాధ్యతలు: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ఎన్‌ఎండీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయన ఇప్పుడు ఇదే సంస్థలో ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్ అయిన అమితవ ముఖర్జీ.. ఎన్‌ఎండీసీలో చేరకముందు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌లో ఫైనాన్స్ విభాగానికి జనరల్ మేనేజర్‌గా చేశారు.