తల్లి భావోద్వేగంతో కూడిన పాటలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచాయి. టాలీవుడ్‌లో అమ్మ ప్రేమను ఆధారంగా చేసుకుని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయ జెండా ఎగురవేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి మదర్ సెంటిమెంట్‌ను కేంద్రంగా తీసుకుని ‘మాతృ’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై శ్రీ పద్మ సమర్పణలో బి. శివ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ‘మాతృ’. గతంలో ‘రా రాజా’ చిత్రంతో దర్శకుడిగా, నిర్మాతగా తన…