విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత డిఫరెంట్ గెటప్స్ వేసి మెప్పించగలిగే తమిళ నటుడు చియాన్ విక్రమ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కోబ్రా చిత్రంతోనూ మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపం చూపడానికి సిద్ధమౌతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే తిరిగి మొదలు కాబోతోందనే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో విక్రమ్ కు మేకప్ వేస్తున్న ఓ స్టిల్…