చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహించిన భర్త తన కుమార్తె ముందే కత్తితో నరికాడు. భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లాయాదమరి మండలం లక్ష్మయ్య కండ్రిగ బస్ స్టాప్ వద్ద ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగ భగకు జనాలు బయటకు రావాలంటే జంకుతున్నారు. వేడితో సతమతమవుతున్న ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చల్లటి కబురు చెప్పింది. సోమవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.