మొదటి రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందు మాట్లాడిన సీఎం జగన్, సమావేశం ముగిసిన తర్వాత మరోసారి జిల్లా కలెక్టర్లతో వర్షాల పరిస్థితులపై సమీక్షించారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన సీఎం జగన్ వారికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాల, ప్రభావాన్ని అడిగి తెలుసు కున్నారు. సీఎం జగన్.రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి మట్టాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు తగిన చర్యలు తీసుకోవా లన్నారు. అవసర మైన చోట వెంటనే సహాయక…