ఒకరు చేతికి ఉంగరం పెట్టుకున్నారు. ఇంకొకరు కనిపించిన దేవుడికి మొక్కుతున్నారు. ఏకంగా గుడే కట్టించేశారు మరొకరు. వీటన్నింటికీ మూల మంత్రం ఒక్కటే. రేస్‌లో ముందుకెళ్లడమే. కొత్త పదవి చేపట్టడం.. లేదా ఉన్న పదవిని కాపాడుకోవడం. ఆ జిల్లాలో అధికారపక్ష నేతలు చేస్తున్న ఈ విన్యాసాలే ఇప్పుడు ఆసక్తిగా మారాయి. సీఎం జగన్‌ను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యం? దేవుడు కరుణించాలి. వరాలు కురిపించాలి. సామాన్య భక్తులు ఈ ఆశతోనే గుళ్లకు వెళ్తారు. ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. రాజకీయ నాయకులైతే…