చిత్తూరులో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు రూరల్ చెర్లోపల్లిలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. జూన్ 12వ తేదీన ఇంట్లో మంచంపై విగతజీవిగా పడి ఉన్న సరోజ అనే మహిళది సహజ మరణంగా భావించారు. జూన్ 13వ తేదీన అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. అయితే, సరోజ కొడుకు కన్నన్ కు ఒక బాలుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆరా…
యువతులకు వారికి నచ్చిన వాటిని ఇస్తానని ఆశలు రేపి అత్యాచారాలకు పాల్పడిన నేరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో చోటుచేసుకుంది. సినిమాకు తీసుకెళ్తానని చెప్పి ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది.
మద్యం కోసం ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు కొందరు ఆకతాయిలు. ఈ దారుణ ఘటన చిత్తూరులో బుధవారం జరిగింది. బుధవారం నాడు చిత్తూరులోని ఇందిరానగర్ సమీపంలో జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు.
చిత్తూరు జిల్లా కమతంపల్లిలో దారుణం జరిగింది. పుంగనూరు మండలం కమతంపల్లిలో మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
చిత్తూరు జిల్లాలో లోకేష్ అనే వ్యక్తి మేస్త్రీగా పని చేస్తుంటారు. లోకేష్ తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన వ్యక్తి. తమిళనాడులోని ఇంటికి అప్పులిచిన వారి బెడదతో లోకేష్ కు పిల్లనిచ్చిన మామ ఫోన్ చేసి మందలించాడు. ఇదే విషయాన్ని తన భార్యకు ఫోన్ చేసి చెప్పాడు లోకేష్. అయితే భార్య కూడా మందలించడంతో..