భారతదేశంలో మినీ నయాగరాగా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని చిత్రకోట్ జలపాతంలో ఆత్యహత్య చేసుకునేందుకు ఓ యువతి దూకింది. జలపాతం దగ్గర ఉన్న వ్యక్తులు.. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా.. ఆమె నీటిలో దూకేసింది. ఆ యువతి దాదాపు 110 అడుగుల ఎత్తు నుంచి వాటర్ ఫాల్స్ లోకి దూకింది. అదృష్టవశాత్తూ ఆమె చావు నుంచి తప్పించుకుంది.