జనసేన 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. అధికారంలో భాగస్వామ్యం అయిన తర్వాత తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో పండగ వాతావరణంలో చేయడానికి ఏర్పాటు చేస్తోంది ఆ పార్టీ.. శాసనసభ్యులు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలంతా ఇవాళ్టి సభను సక్సెస్ చేయడంలో బిజీగా ఉన్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ని గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంలో జయకేతనం సభ గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు..