మనుషుల జీవితాలను కాపాడే పుణ్య కార్యానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరోసారి మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రవేశపెట్టిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో ఈసారి యువ హీరో తేజ సజ్జా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజ సజ్జా, సంయుక్త మీనన్ హాజరవగా.. విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘రక్తదానం ఒక ప్రాణదానంలా భావించాలి. ఒక చుక్క…