మనుషుల జీవితాలను కాపాడే పుణ్య కార్యానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి మరోసారి మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి ప్రవేశపెట్టిన మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌లో ఈసారి యువ హీరో తేజ సజ్జా రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తేజ సజ్జా, సంయుక్త మీనన్ హాజరవగా.. విశిష్ట అతిథిగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ సందర్భంగా తేజ సజ్జా మాట్లాడుతూ.. ‘రక్తదానం ఒక ప్రాణదానంలా భావించాలి. ఒక చుక్క రక్తం ప్రాణాన్ని కాపాడగలదు. మెగా ఫ్యామిలీ చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది’ అని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి రక్తదానం ప్రాముఖ్యతను వివరిస్తూ..
Also Read : Girls & Depression: అమ్మాయిలు ఎక్కువగా డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్లిపోతారు..? శాస్త్రం ఏం చెబుతోందంటే?
యువత అందరూ ముందుకొచ్చి, సమాజానికి సేవ చేయాలి. రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకోవాలి’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది యువత రక్తదానం చేయడానికి ముందుకు రావడం గమనార్హం. చిరంజీవి వెల్‌ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్ దేశవ్యాప్తంగా మంచి స్పందనను పొందుతోంది. కాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అభిమానులు తేజ సజ్జా, సంయుక్త మీనన్, చిరంజీవిల సేవా మనోభావాన్ని అభినందిస్తున్నారు.