నేడు ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరంజీవివి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెగాస్టార్ దంపతులతో పాటు చిరు తల్లి…