”సినిమా రంగానికి చెందిన 24 శాఖల కార్మికులు నివసిస్తున్న చిత్రపురి కాలనీలో హాస్పిటల్ నిర్మించి ఇస్తానని మెగాస్టార్ చిరంజీవి మాటిచ్చారని చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ తెలిపారు. ఆదివారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రపురి కాలనీలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైటీ స్టార్ శ్రీకాంత్ అతిథిగా హాజరయ్యారు. బ్లడ్ డొనేషన్ చేసిన వారికి ప్రోత్సాహక బహుమతులను శ్రీకాంత్ చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందజేశారు. ఈ…