కరోనా క్రైసిస్ ఛారిటీని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం కొంతకాలంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా తుదిదశకు చేరుకుంది.…