ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తండ్రి జీతం ఉంటూ, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తన తమ్ముళ్లని చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి జీతం ఉన్న ఇంట్లోనే పశువుల కాపరిగా చేరి నాలుగేళ్లు పనిచేసి కుటుంబానికి అండగా నిలిచాడు. అప్పటికి యువకుడి వయసు 13 ఏళ్లు. బడి అంటే ఏంటో తెలియదు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని…