బద్వేల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో అట్లూరు మండలంలోని చిన్నమరాజుపల్లె గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని, తాము బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామ పొలిమేర్లలో బ్యానర్‌ను కట్టారు. ఏ నాయకుడు తమ గ్రామంలోకి రావొద్దని, గ్రామానికి రోడ్డు…