నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానిక ప్రభుత్వ కాలేజీలో చదువుతున్న చిన్న మస్తాన్ అనే విద్యార్థి ఇంటర్ ఫలితాల్లో ఫెయిలయ్యాడు.