Bangladesh: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ), జమాతే ఇస్లామీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, తాజాగా జమాతే ఇస్లామి అధినేత షఫీకుర్ రెహమాన్‌ను చైనా రాయబారి యావో వెన్ సోమవారం కలవడం చర్చనీయాంశంగా మారింది.