Nagarkurnool Childrens Kidnap News: ఇటీవలి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల కిడ్నాప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లో చిన్నారులను అపహరించే ముఠాలు సంచరిస్తుండడంతో.. జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొందరు పిల్లలు అపహరణకు గురికాగా.. అందులో కొందరిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. పోలీసుల నిఘా, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నా కూడా ముఠాలు వెనక్కి తగ్గడం లేదు. తాజాగా నాగర్ కర్నూల్ జిల్లాలో చిన్నారులను అపహరించేందుకు అగంతకులు ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం…