కేంద్ర ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) రూల్స్ 2025ను విడుదల చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ కొత్త నియమాలు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023ను అమలు చేయడానికి ఉద్దేశించబడ్డాయి. కొత్త నిబంధనల ప్రకారం, సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, వినియోగదారుల వ్యక్తిగత డేటాను నిల్వ చేసే అన్ని కంపెనీలు తాము ఏ డేటాను నిల్వ చేస్తున్నారో, దానిని ఎలా ఉపయోగిస్తారో వెల్లడించాల్సి ఉంటుంది.…