Jeedimetla: జీడిమెట్లలో కలకలం రేపిన తల్లి, పిల్లల మరణ ఘటనపై తాజాగా కొత్త వివరాలు బయటకు వచ్చాయి. కరోనా తర్వాత తేజస్విని తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భర్త వెంకటేశ్వర్ రెడ్డి డ్యూటీకి వెళ్లిన తర్వాత, పిల్లలు స్కూల్‌కు వెళ్లాక తేజస్విని ఇంట్లో ఒంటరిగా ఉండే పరిస్థితి ఏర్పడడంతో.. ఆమెలో ఒంటరితనంతో పాటు తీవ్రమైన డిప్రెషన్ ఏర్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు. అయితే గురువారం మధ్యాహ్నం మూడున్నర ప్రాంతంలో తేజస్విని తన తల్లితో ఫోన్‌లో మాట్లాడింది.…