Bengaluru Cops seize explosives: బెంగళూరులో పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. నగరంలోని చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో ఆపి ఉంచిన ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను బెంగళూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిలెటిన్ స్టిక్‌లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో సహా ఇతర పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి చిక్కనాయకనహళ్లి ప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ట్రాక్టర్‌లో పేలుడు పదార్థాలను గుర్తించినట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ యజమానిపై ఎఫ్‌ఐఆర్ నమోదు…