కరోనా సెకండ్ వేవ్ విలయమే సృష్టిస్తోంది.. ఎంతోమంది సామాన్యులే కాదు.. వీవీఐపీలు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.. ఎవ్వరైతే నాకేంటి అంటూ అందరినీ టచ్ చేస్తోంది వైరస్.. ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నా, అధైర్యపడినా ప్రాణాలు తీస్తోంది.. ఇక, తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఆయన.. పాట్నాలోని ఓ ఆస్పత్రిలో…