ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వలస వచ్చి యుపిలోని వివిధ జిల్లాల్లో స్థిరపడిన కుటుంబాలకు తీపికబురును అందించారు. ఈ ప్రజలకు చట్టబద్ధంగా భూమిపై యాజమాన్య హక్కు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇది కేవలం భూ పత్రాలు ఇవ్వడం మాత్రమే కాదని, సరిహద్దుల అవతల నుంచి నిర్వాసితులై భారత్ లో ఆశ్రయం పొంది, గత కొన్ని దశాబ్దాలుగా…
Yogi Adityanath: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అలంగీర్ ఆలం తన సన్నిహితుడి ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయనను సీఎం యోగి ‘ఔరంగజేబు’తో పోల్చారు. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే ఆలంగీర్ రాష్ట్రంలోని పేదలను దోచుకున్నాడని ఆయన అన్నారు. జార్ఖండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఔరంగజేబు…
ఉత్తరప్రదేశ్‌లో 'జీరో టాలరెన్స్ పాలసీ' కింద యోగి ప్రభుత్వం నేరాలు, నేరస్థుల వివరాలు వెల్లడించింది. దీని కింద రాష్ట్రంలోని పేరుమోసిన నేరస్థులు, అక్రమ డ్రగ్ డీలర్లు, ఆయుధాల స్మగ్లర్లు, సైబర్ నేరగాళ్లు, ఎగ్జామినేషన్ మాఫియాపై యూపీఎస్‌టీఎఫ్ (UPSTF) వేగంగా చర్యలు తీసుకుంది.
దేశంలో రాజకీయాలను నేరపూరితం చేయకూడదనే సంకల్పంతో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అందుకు భరోసా ఇస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అన్నారు. యువత భవిష్యత్తుతో ఆడుకునే వారు అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నారని ఆయన తెలిపారు. కోయిల్రాలో ఉన్న మా పటేశ్వరి దేవి స్టేట్ యూనివర్శిటీ భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు.
Indigo Ayodhya Flight: ఇండిగో ఎయిర్‌లైన్ అయోధ్య నుండి అహ్మదాబాద్‌కు వాణిజ్య విమాన సర్వీసును ప్రారంభించింది. విమానయాన సంస్థ ఈ కొత్త మార్గాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
ఉచిత పథకాల అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతున్నారు..? ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చేస్తున్నదేంటి? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చగా మారింది.. దీనిని.. Yogi oppose Modi హాష్ ట్యాగ్ జోడిస్తూ.. కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.. అయితే, ఉచిత సంక్షేమ పథకాల వల్ల అభివృద్ది జరగదు అని ప్రధాని చెబుతూ వస్తున్నారు.. ఉచిత పథకాలతో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నాయని విమర్శించిన ప్రధాని.. ఉచితాలు దేశాభివృద్ధిని…