క్లిష్ట సమయంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరూ రైతులకు భరోసా కల్పించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలతో నష్టపోయిన రైతులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.